నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

Naga chaitanya new house cost details - Sakshi

అక్కినేని నాగచైతన్య ఇటీవల కొత్త ఇల్లు కొన్న విషయం దాదాపు అందరికి తెలిసింది. అత్యంత విలాసవంతమైన సదుపాయాలు కలిగిన ఈ ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నాగచైతన్య కొన్న కొత్త ఇల్లు ఖరీదు చాలామందికి ఇంకా ప్రశ్నర్థకంగానే మిగిలింది.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నాగ చైతన్య కొత్త ఇంటి ధర సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ ఇంటిని తన అభిరుచికి తగినట్లుగా, లగ్జరీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. తన సన్నిహితులకు దగ్గరగా ఉండాలన్న కారణంగా కుటుంబీకులకు సమీపంలోని నిర్మించుకున్నాడు.

(ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు)

నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఇంట్లో ఉండేవారు. అయితే వారి విడాకుల తరువాత వారిద్దరూ ఆ ఇంటిని వదిలేసారు. కొన్ని నెలల పాటు తండ్రితోనే ఉన్న ఇతడు ఇటీవలే కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. నాగ చైతన్య వద్ద అత్యంత ఖరీదైన 'ఫెరారీ 488జీటీబీ' కారుతో పాటు బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ, నిస్సాన్ జిటి-ఆర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా MV అగస్టా, బీఎండబ్ల్యూ 9RT వంటి అరుదైన బైకులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top