New Maruti Suzuki Tour S launched at Rs 6.51 lakh - Sakshi
Sakshi News home page

మారుతీ సుజుకీ టూర్‌–ఎస్‌.. అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్‌ ఇదే..

Feb 11 2023 9:14 AM | Updated on Feb 11 2023 10:22 AM

Maruti Suzuki Tour S Sedan Launched - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త టూర్‌–ఎస్‌ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్‌ సెడాన్స్‌ ట్యాక్సీల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ సీఎన్‌జీ కేజీకి 32.12 కిలోమీటర్లు, పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 23.15 కిలోమీటర్లు ఇస్తుందని తెలిపింది. 

పాత సీఎన్‌జీ వేరియంట్‌తో పోలిస్తే 21 శాతం అధిక మైలేజీ. అత్యాధునిక 1.2 లీటర్‌ కె–సిరీస్‌ డ్యూయల్‌ జెట్, డ్యూయల్‌ వీవీటీ ఇంజన్‌ను పొందుపరిచారు. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, బ్రేక్‌ అసిస్ట్, స్పీడ్‌ లిమిటింగ్‌ సిస్టమ్, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్, డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి హంగులు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ధర ఎక్స్‌షోరూంలో రూ.6.51–7.36 లక్షలు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement