Maruti Jimny: ధర తెలియకుండానే దూసుకెళ్తున్న బుకింగ్స్.. అట్లుంటది జిమ్నీ అంటే..

Maruti jimny 5 door launch bookings design features and delivery details - Sakshi

Maruti 5 Door Jimny:  మారుతి సుజుకి భారతదేశంలో విడుదల చేయనున్న '5 డోర్ జిమ్నీ' గురించి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు వెల్లడించింది. ఈ SUV జూన్ 7న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టనుంది. జిమ్నీ ఆఫ్-రోడర్ బుకింగ్స్, డెలివరీలు వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 3 డోర్స్ జిమ్నీ ఇప్పుడు 5 డోర్స్ జిమ్నీ రూపంలో విడుదలకావడనికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే ధరలు మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ధరలు కూడా అధికారికంగా వెల్లడి కాకముందే ఈ ఎస్‌యువి ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. బుకింగ్స్ దాదాపు మ్యాన్యువల్ & ఆటోమాటిక్ వేరియంట్లకు సమానంగా వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

కంపెనీ ఈ 5 డోర్ జిమ్నీ కోసం జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్న ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా తయారైంది. ఇందులో 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.

(ఇదీ చదవండి: తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?)

డెలివరీలు..
5 డోర్ మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్ష‌న్స్‌లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ 1000 యూనిట్లను రూపొందించినట్లు సమాచారం. కావున డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫస్ట్ బ్యాచ్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.

(ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో.. ధర ఎంతో తెలుసా?)

మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది.

జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించన్నప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top