రెండో రోజూ కన్సాలిడేషన్‌- మెటల్స్‌ వీక్‌ 

Market in consolidation mode- Metals weaken - Sakshi

సెన్సెక్స్‌ 95 పాయింట్లు అప్‌- 38,068కు 

25 పాయింట్లు ప్లస్‌- 11,247 వద్ద నిలిచిన నిఫ్టీ‌

ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ గుడ్‌

మెటల్‌, ప్రభుత్వ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో డీలా 

బీఎస్‌ఈలో అటూఇటుగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు 

వరుసగా రెండో రోజూ దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటనే ఎంచుకున్నాయి. దీంతో ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 95 పాయింట్లు బలపడి 38,068 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,236 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,828 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 11,295- 11,185 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

బీపీసీఎల్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం  డీలాపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో 1-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్‌ఎంసీజీ 1.4 శాతం పుంజుకుంది. ఫార్మా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, నెస్లే, డాక్టర్‌ రెడ్డీస్‌, శ్రీ సిమెంట్‌, సిప్లా, యూపీఎల్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బీపీసీఎల్‌ 9 శాతం పతనంకాగా.. ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఐవోసీ, హిందాల్కో, సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ 3.7-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఫార్మా భళా
డెరివేటివ్‌ కౌంటర్లలో టొరంట్‌ ఫార్మా, అపోలో హాస్పిటల్స్‌, గోద్రెజ్‌ సీపీ, ఐబీ హౌసింగ్‌, డాబర్‌, రామ్‌కో సిమెంట్‌, కేడిలా హెల్త్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, ఐడియా, భెల్‌, హెచ్‌పీసీఎల్‌, కంకార్‌, ఇన్‌ఫ్రాటెల్‌, నాల్కో, పీఎఫ్‌సీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బయోకాన్‌, పీఎన్‌బీ, డీఎల్‌ఎఫ్‌ 5.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 1,241 లాభపడగా.. 1,370 నష్టాలతో నిలిచాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top