మార్క్‌ జుకర్‌బర్గ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్‌ హౌగెన్‌!

Mark Zuckerberg Should Quit Facebook, Says Frances Haugen - Sakshi

ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ విజిల్‌ బ్లోవర్‌గా మారిపోయి..ఫేస్‌బుక్‌ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. యూజర్‌ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌పై ఘాటుగా విమర్శలు చేసింది. గతంలో ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, మొదటిసారి బహిరంగ ప్రసంగంలో తన మాజీ బాస్ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను సీఈఓ పదవి నుంచి దిగిపోవాలని బాంబ్ పేల్చింది.

అలాగే, సంస్థ పేరు మార్చడం కంటే ఫేస్‌బుక్‌ నాయకత్వంలో మార్పును కోరుకోవాలని సూచించారు. "మార్క్‌ జుకర్‌బర్గ్‌ సీఈఓగా కొనసాగితే సంస్థ పరిస్థితి మారే అవకాశం లేదని నేను భావిస్తున్నాను" అని హౌగెన్ ఒక వెబ్ సమ్మిట్లో చెప్పారు. కాగా, ఒక మాజీ ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్ మేనేజర్ ను జుకర్ బర్గ్ రాజీనామా చేయాలా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.. "బహుశా మరొకరు పగ్గాలు చేపట్టే సమయం వచ్చిందని భావించవచ్చు.. భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టె వ్యక్తి వల్ల ఫేస్‌బుక్‌ తిరిగి బలంగా నిలబడే అవకాశం ఉంది" అని అన్నారు.

(చదవండి: ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్‌బీఐ తీపికబురు)

ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల విమర్శలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాతృ సంస్థ పేరును మార్చిన విషయం తెలిసిందే. జుకర్‌బర్గ్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంతకుముందు ఫేస్‌బుక్‌ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు(ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు) ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. ‘‘ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మన సంస్థ బ్రాడ్‌ పేరును మార్చాల్సి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. కానీ, పేరు మార్చిన తర్వాత కూడా విమర్శలు, నష్టాలు తగ్గకపోవడంతో జుకర్‌బర్గ్‌పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top