మీ బట్టలు మీరే ఉతుక్కోండి,ఎవరూ ఉతకరు..ఉద్యోగులకు జుకర్‌ నోటీసులు!

Mark Zuckerberg Meta Employees Will Now Have to Do Their Own Laundry - Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌(మెటా) పరిస్థితి మేడిపండను తలపిస్తుంది. పైకి అంతా బాగున్నట్లే ఉన్నా కరోనా కారణంగా ఆర్ధిక చిత్రం దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌ బెర్గ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థలోని ఉద్యోగులకు అందించే ప్రోత్సహకాల్ని నిలిపివేసినట్లు  న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించింది.  
 
సిలికాన్‌ వ్యాలీ. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ గూగుల్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌ తో పాటు ఇతర దిగ్గజ టెక్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న టెక్‌ కంపెనీలన్నీ ఉద్యోగుల నుంచి ఫలితాల్ని రాబట్టేందుకు, ఎక్కువ పనిగంటలు పనిచేయించుకునేందుకు భారీ ఎత్తున ప్రోత్సహకాల్ని అందిస్తుంటాయి. అయితే కరోనా, వరుస వివాదాల కారణంగా భవిష్యత్‌లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఉద్యోగుల ధరించే దుస్తువుల‍్ని ఉతకడం, ఐరన్‌ చేయడంలాంటి సౌకర్యాల్ని ఫేస్‌బుక్‌ తొలగించింది. ఉద్యోగులకు సాయంత్రం 6.00గంటలకు డిన్నర్‌ టైమ్‌కు ఉచితంగా భోజనాన్ని అందిస్తుంది. ఆ సమయాన్ని సాయంత్రం 6.30కి పెంచడం, వ్యాలెట్‌ సేవల్ని సైతం కట్‌ చేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో హైలెట్‌ చేసింది.

ఉద్యోగులకు తొలగించిన ప్రోత్సహకాలు కంపెనీకి తగ్గుతున్న ఆదాయానికి ముడిపడి ఉంది. భవిష్యత్‌ లక్ష్యాలను ప్రతిభింభించేలా ఫేస్‌బుక్‌ పేరును మెటా మార్చింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వ్యాల్యూ 515డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో జుకర్‌ బెర్గ్‌ తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో  ఉద్యోగులకు కంపెనీ అందించే ప్రోత్సహాకాలకు, కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వ్యాల్యూ పడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఫేస్‌బుక్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులకు అందించే సదుపాయాల విషయంలో ఫేస్‌బుక్‌ ఇలా ఉందని, కానీ వారి ఆరోగ్యంతో పాటు ఇతర సెక్యూరిటీల విషయంలో అందించే ఫండ్‌ ను 300 డాలర్ల నుంచి 3వేల డాలర్లకు పెంచిందని సూచిస్తున్నారు.

చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్‌ ! జుకర్‌ బర్గ్‌ ఒక్కో యూజర్‌కు తలా రూ.5వేలు ఇస్తారా!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top