సాగర తీరంలో లగ్జరీ ఫ్లాట్‌.. రూ.41 కోట్లకు కొన్న కేరళ బిజినెస్‌మ్యాన్‌ | Manappuram Finance MD buys sea facing apartment for Rs 41 crore | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో లగ్జరీ ఫ్లాట్‌.. రూ.41 కోట్లకు కొన్న కేరళ బిజినెస్‌మ్యాన్‌

Jul 4 2024 3:19 PM | Updated on Jul 4 2024 3:19 PM

Manappuram Finance MD buys sea facing apartment for Rs 41 crore

కేరళకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పి.నందకుమార్ ముంబైలో ఖరీదైన లగ్జరీ సీ ఫేసింగ్ అపార్ట్మెంట్‌ కొనుగోలు చేశారు. ప్రైమ్‌ కార్టర్ రోడ్డులో రూ.41.25 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ కొన్నట్లు ఈ లావాదేవీకి సహకరించిన రియల్ ఎస్టేట్ ప్రాప్టెక్ కంపెనీ నోబ్రోకర్‌ను ఉటంకిస్తూ మనీకంట్రోల్‌ నివేదిక పేర్కొంది.

వెస్ట్ బాంద్రా ప్రాంతంలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. ఏప్రిల్ 24న రిజిస్ట్రేషన్ జరగ్గా, ఎస్ రహేజా డెవలపర్స్ దీనిని విక్రయించింది. దీని కోసం నందకుమార్ రూ.2.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్రస్తుతం ముంబైలో కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నందకుమార్ కుమారుడు ఈ నివాసం ఉపయోగించనున్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఈ కుటుంబానికి ముంబైలో ఇదే తొలి ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్.

ముంబైలోని ఈ ఖరీదైన ప్రాంతంలో ఇటీవల పలువురు వ్యాపార సినీ ప్రముఖలు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. యానిమల్, బుల్బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించిన నటి తృప్తి దిమ్రీ జూన్ 3న ముంబైలోని బాంద్రా వెస్ట్‌ కార్టర్ రోడ్‌లో ఓ లగ్జరీ ప్రాపర్టీని రూ.14 కోట్లకు కొనుగోలు చేశారు.  అంతకు ముందు మే నెలలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివాలిలో ఆరు లగ్జరీ అపార్ట్‌మెంట్లను రూ .15.42 కోట్లకు కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement