ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు | Mahindra Scorpio N Gets Safer and Smarter with ADAS New Z8T Variant | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు

Jun 28 2025 1:05 PM | Updated on Jun 28 2025 1:30 PM

Mahindra Scorpio N Gets Safer and Smarter with ADAS New Z8T Variant

మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీకి లెవల్ 2 అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్‌)ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దాంతోపాటు రూ.20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. స్కార్పియో-ఎన్‌ను ప్రవేశపెట్టి మూడేళ్ల అయినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఈ సిరీస్‌ కస్టమర్లను సంపాదించుకున్నట్లు పేర్కొంది.

కొత్తగా తీసుకొచ్చిన లెవల్ 2 అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్‌)ను జెడ్ 8 ఎల్ వేరియంట్‌లో ప్రవేశపెడుతున్నట్లు ఎం అండ్‌ ఎం చెప్పింది.  ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్లు డ్రైవర్ అవగాహనను పెంచేందుకు, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు

అదనంగా మహీంద్రా తన ఐసీఈ ఎస్‌యూవీ ఇంజిన్‌లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికిల్‌ నిర్దిష్టమైన వేగాన్ని దాటినప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్‌ అయి డ్రైవర్‌కు సమాచారం తెలియజేస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగ్‌ను వాడుకోవచ్చు. ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ద్వారా ముందున్న వాహనం కదలడం ప్రారంభిస్తే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్‌లో చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement