breaking news
adas
-
ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీకి లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దాంతోపాటు రూ.20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. స్కార్పియో-ఎన్ను ప్రవేశపెట్టి మూడేళ్ల అయినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఈ సిరీస్ కస్టమర్లను సంపాదించుకున్నట్లు పేర్కొంది.కొత్తగా తీసుకొచ్చిన లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను జెడ్ 8 ఎల్ వేరియంట్లో ప్రవేశపెడుతున్నట్లు ఎం అండ్ ఎం చెప్పింది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్లు డ్రైవర్ అవగాహనను పెంచేందుకు, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడుఅదనంగా మహీంద్రా తన ఐసీఈ ఎస్యూవీ ఇంజిన్‌లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికిల్ నిర్దిష్టమైన వేగాన్ని దాటినప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్ అయి డ్రైవర్‌కు సమాచారం తెలియజేస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగ్‌ను వాడుకోవచ్చు. ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ద్వారా ముందున్న వాహనం కదలడం ప్రారంభిస్తే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్‌లో చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది. -
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇదే మార్గం: నితిన్ గడ్కరీ
భారతదేశంలో గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' వెల్లడించారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి మార్గం ఆటోమోటివ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టడమే అని ఆయన పేర్కొన్నారు.వాహన తయారీ సంస్థలు వాహనాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బేస్డ్ ఫీచర్స్ అందించాలి. అప్పుడే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని పలువురు నిపుణులు విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయని చెబుతున్నారు.ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) అనేది రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇందులో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, పార్కింగ్ అసిస్టెన్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వార్డ్ కొలీషియన్ వార్ణింగ్, ట్రాఫిక్ రికగ్నైజేషన్, హై బీమ్ అసిస్టె, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం, సరౌండ్ వ్యూ కెమెరా, లేన్ అడాఫ్టివ్ వార్ణింగ్ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన ప్రమాదాలను తగ్గిస్తాయి.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ఏడీఏఎస్ ఫీచర్స్ వల్ల హైవేల మీద వాహన వేగాలను పరిమితం చేయడమే కాకుండా.. ముందున్న వాహనాలను కూడా గుర్తిస్తాయి. వేగాన్ని నియంత్రించాలని డ్రైవర్లకు అలెర్ట్ ఇస్తాయి. డ్రైవర్ స్పందించనప్పుడు ఆటోమాటిక్‌గా వేగం తగ్గుతుంది. ఇలా ప్రమాదాలను భారీగా తగ్గించడంలో ఏడీఏఎస్ ఫీచర్స్ చాలా ఉపయోగపడతాయి. -
టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి
టెక్నాలజీ పెరగడంతో కార్లలో ADAS వంటి అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారులను ప్రమాదం నుంచి తప్పించడానికి, ప్రమాదం జరిగే ముందు అలర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ ఫీచర్లను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వెనుక సీటును బెడ్‌గా మార్చి ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూడవచ్చు. అయితే ఈ కారులో డ్రైవర్ లేకపోవడం గమనించవచ్చు. కారు ఎంత వేగంగా వెళ్తోంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు అందుబాటులో లేదు, కానీ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కారు హైవే మీద ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఉపయోగించినట్లు అర్థమవుతోంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ డ్రైవర్ ప్రమేయం లేకుండా ఒక స్థిరమైన వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అత్యవసర సమయంలో డ్రైవర్ కారుని కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కారు ఆగిపోతుంది. వెంటనే కారు ఆగిపోతే.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఈ కారుని ఢీ కొట్టే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే కారులో ప్రయాణించే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
టాటా టెక్నాలజీస్‌తో టిహాన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ’టిహాన్’ ఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ వెల్లడించింది. సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాలు (ఎస్‌డీవీ), అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) విభాగాల్లో కలిసి పని చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ఆటోమోటివ్ కంపెనీలు సాఫ్డ్‌వేర్ ఆధారిత వాహనాలను రూపొందించే కొద్దీ వ్యయాలను తగ్గించుకునే దిశగా వినూత్న సొల్యూషన్స్ కోసం అన్వేషిస్తుంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తగు ప్లాట్‌ఫామ్‌లను రూపొందించడం, తమ ఇంజినీర్లకు కొత్త సాంకేతికతలపై టిహాన్లో శిక్షణ కల్పించడంపై ఎంవోయూ కింద ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాటా టెక్నాలజీస్ ఎండీ వారెన్ హారిస్ తెలిపారు. ఈ భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమోటివ్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలకు ఊతం లభించగలదని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. స్వయం చాలిత టెక్నాలజీలకు సంబంధించి ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన హబ్‌ను టిహాన్గా వ్యవహరిస్తున్నారు. -
ఏడీఏలకు ఇన్ పుట్ పంపిణీ బాధ్యత
అనంతపురం అగ్రికల్చర్ : ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ బాధ్యత వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడీఏలు)కు అప్పగించారు. గతంలో వీరి భాగస్వామ్యం లేకుండా ఏవోలు కీలకంగా వ్యవహరించారు. జిల్లా స్థాయి ఇన్పుట్ సెల్ అధికారులు పర్యవేక్షించారు. మిస్‌మ్యాచింగ్ జాబితాలు పెరిగిపోవడం, వాటిని సరిచేసుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు పరిగణనలోకి తీసుకుని ఈసారి డివిజ¯ŒS స్థాయిలోనే వీటికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ఏడీఏలకు బాధ్యత అప్పగించారు. ఆది, సోమవారం డివిజ¯ŒS ఏడీఏలు, వారి పరిధిలోని ఏవోలందరూ స్థానిక జేడీఏ కార్యాలయంలో మకాం వేసి జాబితాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ–క్రాప్ బుకింగ్ సమయంలో వివరాలన్నీ తెలుగులో నమోదు చేశారు. ఇప్పుడు వాటిని ట్రెజరీకి సమర్పించడానికి ఇంగ్లిష్‌లోకి మారుస్తున్నారు. అలాగే డబుల్ ఎంట్రీలు, ఒక మండలం కాకుండా ఇతర మండలాల్లోనూ భూములున్న వారి పేర్లు ఆధార్‌తో అనుసంధానం చేసి తీసివేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో తొలివిడతగా పరిహారం విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.