టాటా టెక్నాలజీస్‌తో టిహాన్‌ జట్టు | Sakshi
Sakshi News home page

టాటా టెక్నాలజీస్‌తో టిహాన్‌ జట్టు

Published Tue, May 9 2023 4:29 AM

Tata Tech signs MoU with IIT Hyderabad to collaborate on SDVs, ADAS development - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ’టిహాన్‌’ ఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్‌ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్‌ వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వాహనాలు (ఎస్‌డీవీ), అధునాతన డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ (ఏడీఏఎస్‌) విభాగాల్లో కలిసి పని చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ఆటోమోటివ్‌ కంపెనీలు సాఫ్డ్‌వేర్‌ ఆధారిత వాహనాలను రూపొందించే కొద్దీ వ్యయాలను తగ్గించుకునే దిశగా వినూత్న సొల్యూషన్స్‌ కోసం అన్వేషిస్తుంటాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో తగు ప్లాట్‌ఫామ్‌లను రూపొందించడం, తమ ఇంజినీర్లకు కొత్త సాంకేతికతలపై టిహాన్‌లో శిక్షణ కల్పించడంపై ఎంవోయూ కింద ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాటా టెక్నాలజీస్‌ ఎండీ వారెన్‌ హారిస్‌ తెలిపారు. ఈ భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమోటివ్‌ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలకు ఊతం లభించగలదని ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీ–హెచ్‌) డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. స్వయం చాలిత టెక్నాలజీలకు సంబంధించి ఐఐటీ–హెచ్‌లో ఏర్పాటు చేసిన హబ్‌ను టిహాన్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement