StockMarketUpdate: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Losses For Second Straight Session Falls Over above 300 Points - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్‌, ఎఎఫ్‌సీజీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 342  పాయింట్లు  కుప్పకూలి 62524 వద్ద నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి  18598 వద్ద కొనసాగుతున్నాయి.

హిందాల్కో, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌  బ్యాంకు యూపీఎల్‌ లాభపడుతుండగా, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, బ్రిటానియా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎం అండ్‌ ఎం టైటన్‌ నష్టపోతున్నాయి. అలాగే డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.37 వద్ద ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top