LinkedIn Users: ఈ జాబ్‌ స్కిల్స్‌ మీలో ఉన్నాయా? ఉంటే.. కోరుకున్న ఉద్యోగం మీదే!

LinkedIn Crosses 100 Million Members In India - Sakshi

ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆర్జన శక్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు తగ్గిపోయే పరిస్థితులు ఎదుర్కొనబోతున్న నేపథ్యంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమల నుంచి బడాబడా టెక్‌ కంపెనీల వరకు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. 

అయితే జాబ్‌ మార్కెట్‌ ఎక్కువగా ఉండే దేశాలతో పాటు భారత్‌ వంటి దేశాల్లో కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఆ నివేదికలకు కొనసాగింపుగా.. భారత్‌లో ప్రొఫెషనల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ లింక్డ్‌ ఇన్‌కు బుధవారం నాటికి 56 శాతం వృద్దితో 100 మిలియన్ల మంది యూజర్లను దాటినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ ఇన్‌ గ్లోబల్‌ ఎక్కువ మంది యూజర్లు ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.   

ఇక భారత్‌కు చెందిన యూజర్లు లింక్డ్‌ ఇన్‌లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ & ఐటీ, మ్యానిఫ్యాక్చరింగ్‌, కార్పొరేట్‌ సర్వీస్‌,ఫైనాన్స్‌, ఎడ్యూకేషన్‌ రంగాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 

నేర్చుకునేందుకు 4.6 మిలియన్ల గంటలు 
2022లో లింక్డ్‌ ఇన్‌లో భారత్‌కు చెందిన యూజర్లు ఎక్కువగా నేర్చుకునేందుకు సమయం వెచ్చించారు. యూఎస్‌ యూజర్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా భారత్‌ యూజర్లు లెర్నింగ్‌ కోసమే 4.6 మిలియన్ గంటలు వెచ్చించారు.
 
టాప్‌ 10 స్కిల్స్‌ ఇవే 
మనదేశంలో డిమాండ్ ఉన్న టాప్ 10 స్కిల్స్‌ జాబితాలో మేనేజ్‌మెంట్ (1వ స్థానం), కమ్యూనికేషన్ (4),సేల్స్‌ (10), సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ (2), ఎస్‌క్యూఎల్‌ (3), జావా (5), లీడర్‌షిప్ (6), అనటికల్‌ స్కిల్స్‌ (8)ఈ జాబితాలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top