పునరుత్పాదక విద్యుత్‌పై ఎల్‌జీఈ ఇండియా ఫోకస్‌ | LGE India Partners with Hinduja and Sunsure for Solar Power Transition | Sakshi
Sakshi News home page

పునరుత్పాదక విద్యుత్‌పై ఎల్‌జీఈ ఇండియా ఫోకస్‌

Mar 29 2026 8:06 AM | Updated on Mar 29 2026 8:08 AM

LGE India Partners with Hinduja and Sunsure for Solar Power Transition

న్యూఢిల్లీ: కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్‌ పీక్‌ (ఎండబ్ల్యూపీ) సోలార్‌ పవర్‌ కోసం హిందుజా రెన్యువబుల్స్‌ ఎనర్జీతో, అలాగే గ్రేటర్‌ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్‌ష్యూర్‌ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్‌ జనరేట్‌ అవుతుందని సంస్థ వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement