ఏముంది భయ్యా ఆ జీన్స్‌ ప్యాంట్‌లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్‌!

Levi Jeans From 1880 Auctioned For 76000 Dollars - Sakshi

వస్తువులు పాతవయ్యే కొద్దీ వాటిని పక్కన పెట్టడం సహజం. వాటి విలువ తగ్గడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, పాడైపోవడం లాంటి కారణాలతో పక్కన పెట్టేస్తాం. ఇదంతా ఒక వైపే. మరో వైపు చూస్తే.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ దశాబ్దాల కాలం నాటి వస్తువుల కోసం కోట్లు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ నగదు చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. 

అమ్మో..  ఈ ప్యాంటు ధర రూ.60 లక్షలా!
అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది.  శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది.

దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు. 

చదవండి: యూజర్లకు బంపరాఫర్‌.. రూ.10కే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top