నెలలో 22,315 యూనిట్లు సరఫరా | Kia India Reports Strong Year on Year Growth in May | Sakshi
Sakshi News home page

నెలలో 22,315 యూనిట్లు సరఫరా

Jun 2 2025 2:27 PM | Updated on Jun 2 2025 3:21 PM

Kia India Reports Strong Year on Year Growth in May

భారత ఆటోమోటివ్ మార్కెట్‌లో కియా ఇండియా తన ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. మే 2025లో దేశీయంగా డీలర్లకు పంపించిన కార్ల సరఫరాలో సంవత్సరం ప్రాతిపదికన 14% వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2023లో 19,500 యూనిట్లతో పోలిస్తే మే 2025లో కంపెనీ 22,315 యూనిట్లను సరఫరా చేసినట్లు బిల్లులు దాఖలు చేసింది. ఈ పెరుగుదల కియా పోర్ట్‌ఫోలియోకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని కంపెనీ చెప్పింది.

ఇదీ చదవండి: పన్ను ఆదా కోసం ఫేక్‌ చేస్తే.. కొత్త రూల్స్‌తో కొరడా

కారెన్స్ క్లావిస్

కియా లైనప్‌లో ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ మోడల్‌ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ మోడల్‌ స్టైల్, ఫంక్షనాలిటీ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగదారులకు ఆకర్షిస్తుందని తెలిపారు. కాంపాక్ట్ ఎస్‌యూవీల నుంచి ప్రీమియం ఎంపీవీల వరకు వివిధ రకాల వాహనాలను అందించడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement