ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? | Kat Norton Earns 1 Crore Per Month By Teaching Excel Tips On Instagram And Tiktok | Sakshi
Sakshi News home page

ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?

Dec 2 2021 9:35 PM | Updated on Dec 2 2021 11:04 PM

Kat Norton Earns 1 Crore Per Month By Teaching Excel Tips On Instagram And Tiktok - Sakshi

డబ్బులు సంపాదించేందుకు కష్టపడుతున్నారా? అయితే కష్టపడొద్దు. ఇష్టపడండి. ఇష్టపడితే మీరు అనుకున్న విధంగా డబ్బులు సంపాదించవచ్చని చెబుతోంది ఓ యువతి. అంతేకాదు స్వతంత్రంగా డబ్బులు సంపాదించేందుకు ఎంఎన్‌సీ ఉద్యోగానికి రిజైన్‌ చేసింది. ఆడుతూ పాడుతూ కోట్లు సంపాదిస్తుంది. 

మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ఎల్‌ వస్తే కోట్లు సంపాదించవచ్చని మీకు తెలుసా? ది ఎక్స్‌ప్రెస్ ప్రకారం 27 ఏళ్ల కాట్ నార్టన్ (@miss.excel) మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను ఆన్‌లైన్‌లో నేర్పిస్తుంది. ఇందుకోసం ఏడాది క్రితం జాబ్‌కు రిజైన్‌ చేసి యూట్యూబ్‌లో వీడియోస్‌ అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించింది. సీన్‌ కట్ చేస్తే ఏడాది తిరిగే సరికల్లా ఆమె నెలవారీ సంపాదన ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయలకు పై మాటే. 

అందరిలా కాట్‌ నార్టన్‌ కు ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకాలని, డబ్బులు సంపాదించాలని అనుకుంది. అనుకున్నట్లుగా గతేడాది నవంబర్‌లో యూట్యూబ్‌ తోపాటు ఇతర సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లలో ఆన్‌లైన్‌ టుట్యూరియల్‌ను ప్రారంభించింది. యూజర్లు అట్రాక్ట్‌ అయ్యే విధంగా వివిధ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టిప్స్‌ అండ్‌ ట్రిక్స్‌ వీడియోలు చేసింది. పనిలో పనిగా అదే ఎక్స్‌ఎల్‌ టిప్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌ టాక్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసింది. పెయిడ్‌ కోర్స్‌లను ప్రారంభించింది. అలా సరదాగా ప్రారంభమైన ట్యుటోరియల్‌ వీడియోలతో భారీ ఎత్తున సంపాదిస్తుంది. సుమారు నెలకు కోటిరూపాలయకు పైగా సంపాదిస్తున్నట్లు ది ఎక్స్‌ ప్రెస్‌ తన కథనంలో పేర్కొంది. 

చదవండి:ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement