 
													సాక్షి, ముంబై: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ఉగాది పండుగ సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50వేల విలువైన బంగారు, వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.1,000 గిఫ్ట్ ఓచర్‌ను పొందవచ్చు. అలాగే రూ.50 వేల డైమండ్, అన్‌కట్ ఆభరణాలపై రూ.5వేల గిఫ్ట్ ఓచర్ లభించనుంది. ఈ ఆఫర్ ఈ ఏప్రిల్ 14న ముగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జోయాలుక్కాస్ షోరూంలలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

తెలుగు వారి నూతన సంవత్సరాన్ని జోయాలుక్కాస్ ఆభరణాలు మరింత శుభప్రదం చేస్తాయని కంపెనీ చైర్మన్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. గిఫ్ట్ ఓచర్‌తో పాటు కొనుగోలు చేసిన ఆభరణాలపై జీవితకాలం ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సదుపాయం, తిరిగి కొనుగోలు హామీ సౌలభ్యతలను అందిస్తున్నామని ఆయన వివరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
