జియోటీవీలో అమర్ నాథ్ 'హారతి' ప్రత్యక్ష ప్రసారం

Jio Brings Live Aarti of Amarnath Ji on JioTV - Sakshi

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది దైవ ప్రియలు తమ ఇష్ట దైవలను సందర్శించ లేకపోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమర్ నాథ్ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఒక శుభవార్త తెలిపింది. మనదేశంలో పవిత్రం మందిరం అయిన అమర్ నాథ్ పుణ్య క్షేత్రన్ని భౌతిక దర్శించలేని భక్తుల సహాయ పడటానికి జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. 

మనదేశంలో అత్యంత క్లిష్టమైన భూభాగంలో ఉన్న అమర్ నాథ్ దగ్గర ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికి ప్రత్యక్ష ప్రసారానికి సపోర్ట్ చేసే నెట్ వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ జియో పేర్కొంది. గత వారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భక్తులకు వ్యక్తిగత అనుభవాన్ని అందించడానికి అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు వివిధ ఆన్ లైన్(http://www.shriamarnathjishrine.com/) సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. "కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది శ్రీ అమర్ నాథ్ జీ పవిత్ర మందిరాన్ని సందర్శించలేని లక్షలాది మంది భక్తులకు, పుణ్యక్షేత్రం బోర్డు వర్చువల్ మోడ్ కింద దర్శనం, హవాన్, ప్రసాద్ సౌకర్యాన్ని అందిస్తుంది. భక్తులు తమ పూజ, హవాన్, ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. పవిత్ర గుహ వద్ద ఉన్న పూజారులు భక్తుడి పేరిట దానిని అందిస్తారు. ప్రసాదం తర్వాత భక్తుల ఇంటికి డెలివరీ చేయనున్నట్లు" బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.

అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు కొత్తగా ఆన్ లైన్ సేవలను ప్రారంభించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివుడి భక్తులు పవిత్ర గుహ వద్ద ఆన్ లైన్ లో వర్చువల్ గా 'పూజ', 'హవాన్' నిర్వహించవచ్చు. తాజాగా రిలయన్స్ జియో జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూర్చడం కోసం జియోకు చెందిన JioTV, JioMeet, JioSaavn, JioChat వంటి యాప్స్ ద్వారా ఈ సేవలను ప్రవేశపెట్టింది. జియోటీవీలోని ప్రత్యేక ఛానెల్ లో అమర్ నాథ్ హారతి ప్రత్యక్ష ప్రసారం, జియోమీట్ ద్వారా వర్చువల్ పూజ, హవాన్ అందిస్తుంది. భక్తులు పుణ్యక్షేత్రంలో పూజారితో వర్చువల్ రూపంలో పూజా గదిలో పాల్గొనడం, వారి పేరు, 'గోత్ర'లో హవాన్/పూజను నిర్వహించుకోవచ్చు. ఇక జియో సావన్ లో అమర్ నాథ్ పుణ్య క్షేత్రానికి చెందిన పాటలు ప్లే కావడం, జియో చాట్ ద్వారా ప్రత్యక్ష దర్శనంతో పాటు హారతి సమయం, విరాళాలు పంపవచ్చు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top