ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్..!

IPPB will charge for Depositing, Withdrawing more Than RS 10,000 from January 1 - Sakshi

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న విత్ డ్రా, డిపాజిట్ సేవలకు జనవరి 1, 2022 నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితిని అధిగమించిన తర్వాత ప్రత్యేకమైన ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐపీపీబీ తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు చేయవచ్చు, ఆ తర్వాత ప్రతి విత్ డ్రా లావాదేవీకి దాని విలువలో 0.50%(కనీసం రూ.25) ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. ఈ ఖాతాదారులకు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కాకుండా ఇతర పొదుపు ఖాతాదారులు, కరెంట్ ఖాతాదారులు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.25) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఖాతాదారులు రూ.10వేల వరకు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేల మొత్తానికి పైగా డిపాజిట్‌ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది. గతంలో కూడా ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుంది. 01 ఆగస్టు 2021 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది.

(చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్‌..! వచ్చే మూడేళ్లలో..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top