ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్‌ | Introducing Canon SELPHY QX20 Selfie Printer, Check Its Specifications Inside | Sakshi
Sakshi News home page

ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్‌

Sep 29 2024 12:03 PM | Updated on Sep 29 2024 1:14 PM

Introducing Canon SELPHY QX20 Selfie Printer

స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక జనాలకు ఎడాపెడా సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు ఎంతసేపూ ఫోన్‌లోనో, కంప్యూటర్లలోనో చూసుకోవడమే తప్ప పాతకాలంలోలా వాటిని ప్రింట్‌ చేయించి, ఆల్బమ్స్‌లో దాచుకునే అలవాటు దాదాపు అంతరించింది.

అయితే, సెల్ఫీలను ప్రింట్‌ చేసుకుని, దాచుకోవాలనే ముచ్చట కూడా కొందరికి ఉంటుంది. ఆ ముచ్చట తీర్చడానికే జపానీస్‌ కెమెరాల తయారీ కంపెనీ ‘కేనన్‌’ తాజాగా సెల్ఫీ ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెల్ఫీ క్యూఎక్స్‌20’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ప్రింటర్‌తో స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఫొటోలను నేరుగా ముద్రించుకోవచ్చు.

అలాగే, లాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో భద్రపరచుకున్న ఫొటోలను కూడా ముద్రించుకోవచ్చు. సెల్ఫీ లేఔట్‌ యాప్‌ ద్వారా ఈ ప్రింటర్‌ పనిచేస్తుంది. ఈ యాప్‌ ద్వారా ప్రింట్‌ తీసుకోవడానికి ముందు ఫొటోలను ఎడిట్‌ చేసుకోవడానికి, ఎంపిక చేసుకున్న ఫొటోల కొలాజ్‌ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత్‌ మార్కెట్‌లో దీని ధర రూ. 7,495 మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement