
న్యూఢిల్లీ: క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించడంతో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఏప్రిల్‌లో 3.5 శాతానికి పరిమితమైంది. ఇది ఆరు నెలల కనిష్టం. 2022 అక్టోబర్‌లో చివరిసారిగా ఇన్‌ఫ్రా వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్‌లో మౌలిక రంగాల వృద్ధి 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్‌నకు 40.27 శాతం వెయిటేజీ ఉంటుంది.