మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్‌ నిల్వలు | India’s Forex Reserves Climb Second Consecutive Weekly Rise | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్‌ నిల్వలు

Apr 26 2026 9:09 AM | Updated on Apr 26 2026 9:09 AM

India’s Forex Reserves Climb Second Consecutive Weekly Rise

ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు రెండో వారమూ పెరిగాయి. ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో 2.362 బిలియన్‌ డాలర్లు పెరిగి 703.308 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  అంతకుముందు(ఏప్రిల్‌ 10) వారంలో ఇవి 3.825 బిలియన్‌ డాలర్లు పెరిగి 700.946 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.  

ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.481 బిలియన్‌ డాలర్లు పెరిగి, 557.463 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 790 మిలియన్‌ డాలర్లు పెరిగి 122.133 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement