రైల్వే ప్యాసింజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇక నో ‘ కొవిడ్‌ స్పెషల్‌’ రైళ్లు, టికెట్‌ ధరలు సైతం తగ్గింపు!

Indian Railways Revert To Pre Covid Fares And To Drop Special Train Tag - Sakshi

Indian Railways Revert Ticket Prices: రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు తీపి కబురు అందించింది భారత రైల్వే శాఖ. కరోనా-లాక్‌డౌన్‌ తర్వాత ‘స్పెషల్‌’ పేరిట రైళ్లు నడుపుతూ టికెట్‌ రేట్లు పెంచిన విషయం తెలిసిందే కదా. అయితే ప్రయాణికుల ఒత్తిడి మేరకు ఆ ధరలను పాత రేట్లకే సవరించింది. 

కరోనాకు ముందు ఉన్న టికెట్‌ రేట్లను తక్షణం అమలులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం హడావిడిగా ఆదేశాలు జారీ చేసింది భారత రైల్వే శాఖ. అంతేకాదు కొవిడ్‌ స్పెషల్‌ ట్యాగులను సైతం రైళ్లకు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.  మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ వర్తింపు ఉంటుందని తెలిపింది. అయితే పండుగ పూట నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లకు మాత్రం ఈ సవరణ వర్తించదని స్పష్టం చేసింది. అంతేకాదు పూర్థిస్తాయిలో రైళ్లను నడిపించేందుకు (గతంలో నడిచే 1700 రైళ్లు) సైతం రైల్వే శాఖ సిద్ధమైంది.  కరోనా ప్రభావంతో రైల్వే వ్యవస్థ కొన్ని నెలలపాటు బంద్‌కాగా,  భారత రైల్వే శాఖ ఆదాయం దారుణంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. 

అయితే లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కొన్ని రైళ్లను(ఆల్రెడీ ఉన్న సర్వీసులనే) స్పెషల్‌ ట్రెయిన్స్‌ పేరుతో దాదాపు అన్ని రూట్లలో నడుపుతూ.. అన్ని కేటగిరీల సిట్టింగ్‌లను..  ‘రిజర్వేషన్‌’  కింద మార్చేసి టికెట్‌ రేట్లను పెంచేసింది. దీంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు..  టికెట్‌ రేట్లను సవరించాలంటూ అన్ని జోనల్‌ రైల్వేస్‌కు సూచించింది రైల్వే బోర్డు. అయితే హడావిడిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాన్ని మాత్రం పేర్కొనపోకపోవడంతో గందరగోళం నెలకొనగా..  ఒకటి రెండు రోజుల్లో ఇది అమలులోకి వస్తుందని సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే రాబోయే రోజుల్లో జనరల్‌ టికెట్లకు ‘క్యూ’ సిస్టమ్‌ ఉంటుందా? లేదంటే పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ జారీనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.  ఒక ప్యాసింజర్‌సెగ్మెంట్‌ కంటే ట్రాన్స్‌పోర్టర్‌ ద్వారా రైల్వే శాఖ ఆదాయం (113 శాతం) పెరగడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top