వచ్చే ఆరు నెలల్లో పీసీలకు డిమాండ్‌: హెచ్‌పీ ఇండియా

India Pc Market Recovering Now, More Demand In The Next 6 Months - Sakshi

న్యూఢిల్లీ: వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) మార్కెట్‌ కోలుకుంటోందని, వచ్చే ఆరు నెలల్లో పీసీలకు అధిక డిమాండ్‌ వస్తుందని అంచనా వేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా తెలిపింది. కరోనా నాటితో పోలిస్తే పర్సనల్‌ కంప్యూటర్ల సంఖ్య పెరిగినట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ (పీసీలు) విక్రమ్‌ బేడీ పేర్కొన్నారు. ఇవి ఇంకా పెరిగేందుకు సానుకూలతలు ఉన్నట్టు చెప్పారు.

హెచ్‌పీ ఇండియా మంగళవారం పలు నూతన ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా విక్రమ్‌ బేడీ మాట్లాడారు. హెచ్‌పీ 14, పెవిలియన్‌ ఎక్స్‌360, హెచ్‌పీ పెలివియన్‌ ప్లస్‌ 14 నోట్‌బుక్‌లను విడుదల చేయగా, వీటి ధరలు రూ.39,999 నుంచి రూ.81,999 మధ్యలో ఉన్నాయి. దేశ పీసీ మార్కెట్లో హెచ్‌పీ ఇండియాకి 30 శాతం మార్కెట్‌ వాటా ఉంది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top