ఎగుమతుల్లో హ్యుందాయ్‌ సంచలనం! ఎస్‌యూవీ కేటగిరీల్లో క్రెటా ఏకంగా..

India Most Exported SUV In 2021 Hyundai Creta - Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో హ్యుందాయ్‌ క్రెటా సంచలనం సృష్టించింది. భారత్‌ నుంచి ఒక ఏడాదిలో రికార్డు స్థాయి యూనిట్ల ఎగుమతితో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

హ్యుందాయ్‌ క్రెటా 2021కిగానూ మోస్ట్‌ ఎక్స్‌పోర్టెడ్‌ ఎస్‌యూవీ ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరుగుదల 26.17 శాతం నమోదు కావడం విశేషం. మొత్తం 32, 799 యూనిట్లు ఓవర్సీస్‌కి ఎగుమతి అయ్యాయి. 2020లో యూనిట్ల సంఖ్య 25,995 యూనిట్లుగా ఉంది. 

ఇక 2021లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మొత్తంగా 42, 238 ఎస్‌యూవీల ఎగుమతితో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇందులో క్రెటా గ్రాండ్‌తో పాటు వెన్యూ మోడల్స్‌ కూడా ఉన్నాయి. వెన్యూ 7,698 యూనిట్లు, క్రెటా గ్రాండ్‌ 1,741 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. 

క్రెటా, ఐ20, వెర్నా, అల్కాజర్‌ మోడల్స్‌ను ఎంపిక చేసిన మార్కెట్‌లలోకి వదిలింది హ్యుందాయ్‌ ఇండియా. సౌతాఫ్రికాతో పాటు పెరూ, డొమినికా రిపబ్లికా, చాద్‌, ఘనా, లావోస్‌కు సైతం ఎన్‌ లైన్‌, ఎల్‌పీజీ వేరియెంట్లను ఎగుమతి చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top