Gita Gopinath: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపినాథ్‌..!

IMF Gita Gopinath Wants A Global Policy On Cryptocurrency Not A Ban - Sakshi

పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లోని​ సెంట్రల్‌ బ్యాంకులు క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కోరుతుండగా... ఈ నిర్ణయాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) మద్దతు తెలిపింది. కాగా త్వరలోనే ఐఎమ్‌ఎఫ్‌కు డిప్యూటీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పదవి స్వీకరించనున్న ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపినాథ్‌ క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసింది.   
చదవండి: చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్‌.. ఎక్కాలే రాని చిన్నారి.. ఇప్పుడు ఏకంగా ఐఎంఎఫ్‌లో నెం.2!!

నిషేధం బదులుగా..నియంత్రణే మేలు..!
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నిర్వహించిన కార్యక్రమంలో గీతా గోపినాథ్‌ క్రిప్టోకరెన్సీలపై వ్యాఖ్యానించారు. క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులుగా వాటిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టోకరెన్సీలు  ప్రత్యేక సవాలుగా నిలుస్తాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు క్రిప్టోకరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు . అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మారకపు రేటు నియంత్రణలను కలిగి ఉంటాయి. మూలధన ప్రవాహ నియంత్రణలను క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉందని గీతా పేర్కొన్నారు. 

క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి ఆస్తిలాగానే ఉపయోగిస్తున్నారని, ఆయా దేశాల్లో పెట్టుబడికి సంబంధించిన నియమాలను డిజిటల్‌ కరెన్సీపై కూడా వర్తించేలా చూడాలని గీతా సూచించారు. భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న తరుణంలో గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 23తో ముగియనున్నాయి. కాగా క్రిప్టోకరెన్సీ బిల్లుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తెచ్చే వరకు వేచి చూడాల్సిందే. 
చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top