శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జాతీయ పురస్కారం | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జాతీయ పురస్కారం

Published Tue, Mar 5 2024 9:42 AM

Hyderabad Airport Wins National Award For Energy Efficiency - Sakshi

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు యాక్‌రెక్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌) ప్రతినిధులు అందుకున్నారు. 

ఇదీ చదవండి: మెరైన్‌ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే..

2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అయిదుసార్లు నేషనల్‌ ఎనర్జీ లీడర్‌, తొమ్మిది సార్లు ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్‌, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్‌ ఎయిర్‌పోర్ట్‌ పురస్కారాలు వరించాయని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement