మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసా...!

How To Track Cyclone In Real Time On Smartphone - Sakshi

తెలుగు రాష్ట్రాలను గులాబ్‌ తుపాన్‌ అతాలకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గులాబ్‌ దెబ్బకు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గులాబ్‌ సైక్లోన్‌ ఒక్కటే కాదు పలు సైక్లోన్స్‌ వస్తూనే ఉంటాయి. భారత వాతావరణ శాఖ రాబోయే తుపాన్లపై ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తాయి. తుపాన్‌ బలపడిందా, లేదా బలహీన పడిందా అనే విషయాలను అందుబాటులో ఉన్న వెబ్‌సైట్లను ఉపయోగించి మన స్మార్ట్‌ఫోన్‌తో మనమే ట్రాక్‌ చేయవచ్చుననే విషయం మీకు తెలుసా...! అందుబాటులోని వెబ్‌సైట్ల ద్వారా తుపాన్‌ కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చను. దీంతో తుపాన్‌ ప్రభావం నుంచి కాస్త ఉపశమన చర్యలను ముందుగా తీసుకునే వీలు ఉంటుంది.  

తుపాను కదలికలను ఆన్‌లైన్‌లో ఇలా ట్రాక్ చేయండి

1. www.mausam.imd.gov.in

  • తుపానును ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసే వెబ్‌సైట్లలో  mausam.imd.gov.in అత్యంత విశ్వసనీయమైన వెబ్‌సైట్‌లలో ఒకటి. ఈ వెబ్‌సైట్‌ను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దేశంలో సంభవించే అన్ని తుపానులను ఈ వెబ్‌సైట్‌ ద్వారా ట్రాక్ చేయవచ్చును.
  • మీరు తుపాన్‌ను ట్రాక్‌ చేయలనుకుంటే బ్రౌజర్‌లో mausam.imd.gov.in ఎంటర్‌ చేయండి. తరువాత వెబ్‌సైట్‌లో సైక్లోన్‌పై క్లిక్‌ చేయండి. తరువాత ట్రాక్ సైక్లోన్ డిస్ట్రబెన్స్‌పై క్లిక్‌ చేయగానే ఈ వెబ్‌సైట్‌ ద్వారా తుపాన్లను ట్రాక్‌ చేయవచ్చును. 

2.www.rsmcnewdelhi.imd.gov.in

  • ఉత్తర హిందూ మహాసముద్రం ఏర్పడే తుపాన్లను ట్రాక్‌ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్‌ను భారత వాతావరణశాఖ-ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ అభివృద్ది చేశారు. 

3. ఉమాంగ్‌ యాప్‌(UMANG)

  • ఉమాంగ్‌ యాప్‌ను ఉపయోగించి ప్రత్యక్షంగా తుపాన్లను ట్రాక్‌ చేయవచ్చును. ఈ యాప్‌  గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఉమాంగ్‌ యాప్‌ సహాయంతో తుపాన్ల రియల్‌టైమ్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. 

4. www.hurricanezone.net

  • www.hurricanezone.net వెబ్‌సైట్‌ సహయంతో తుఫాన్ల స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయవచ్చును. ఈ వెబ్‌సైట్‌లో ఇండియన్‌ ఓషన్‌, వెస్ట్‌ పసిఫిక్‌, సౌత్‌ పసిఫిక్, సెంట్రల్‌ పసిఫిక్‌, ఈస్ట్‌ పసిఫిక్‌, అట్లాంటిక్‌ ప్రాంతాల్లో వచ్చే సైక్లోన్లు, టైఫూన్ల, హరికేన్‌లను ట్రాక్‌ చేయవచ్చును. ‌
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top