5 నిమిషాల్లో పాన్‌కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!

How Can I Correct My PAN Card Mistakes in Online Telugu - Sakshi

ఆధార్ కార్డుతో పాటు పాన్‌కార్టు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా కలిగి ఉండాల్సి వస్తుంది. ఆర్థిక‌‌పరమైన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల కోసం, ఐటీ రిట‌ర్న్‌లు దాఖలు చేయడానికి పాన్‌కార్డు క‌చ్చితంగా ఉండాలి. అయితే ఒక్కసారి పాన్‌కార్టు తీసుకున్నామంటే పాన్ నంబ‌ర్‌ను ఎప్పటికీ మార్చ‌లేం. అయితే పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి ఇత‌ర వివ‌రాల్లో ఏమైనా త‌ప్పులు ఉంటే వాటిని అప్‌డేట్ చేసుకునే అవ‌కాశం ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. 

పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి పలు వివరాలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా మార్చుకోవ‌చ్చు. అయితే ప్రస్తుతం అందరూ సులభమైన పద్దతి ఆన్‌లైన్‌లోనే మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎన్‌ఎస్‌డిఎల్ పోర్టల్లో తెలిపిన వివరాల ప్రకారం రూ.100 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది.

పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీని ఎలా సరిచేయాలి?

  • ముందుగా ఎన్‌ఎస్‌డిఎల్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. 
  • ఆన్‌లైన్ పాన్ అప్లికేష‌న్ పేజిలో Application Typeపై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్ష‌న్ ఎంచుకోవాలి. 
  • ఆ త‌ర్వాత Individual పై క్లిక్ చేసి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ పూర్తిచేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
  • కొత్త పేజిలో టోకెన్ నంబ‌ర్ వ‌స్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి.
  • Submit digitally through e-KYC & e-sign (paperless) ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. 
  • దాని త‌ర్వాత కింద‌కి స్క్రోల్ డౌన్ చేసి వ్య‌క్తిగత వివ‌రాల‌ను నింపి Next బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. 
  • అందులో మీరు మార్చాల‌నుకుంటున్న వ్యక్తిగత వివరాలు, అడ్ర‌స్‌ను త‌ప్పులు లేకుండా నింపాలి. 
  • మీ మొబైల్ నంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీని మార్చాల‌ని అనుకున్నా దీనిలో మార్చుకోవ‌చ్చు. 
  • అడ్ర‌స్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని స‌రిగ్గా ఇచ్చిన త‌ర్వాత పేజి కింద ఉన్న next బ‌ట‌న్ క్లిక్ చేయాలి. 
  • ఆ త‌ర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్ర‌స్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్‌ ప్రూఫ్ డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి. 
  • అలాగే ఫొటో, సంత‌కం కూడా మార్చాలనుకున్నా.. స్కాన్ చేసి jpeg ఫార్మ‌ట్‌లో అప్‌లోడ్ చేయాలి. 
  • అనంత‌రం స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • అప్లికేష‌న్ స‌బ్‌మిట్ కాగానే.. అక‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ జ‌న‌రేట్ అవుతుంది. ఫోన్ నెంబర్‌కు, మెయిల్‌కు మెస్సెజ్ కూడా వస్తుంది. 
  • అనంతరం ఆ స్లిప్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. 
  • ఆ తర్వాత అప్లికేష‌న్‌ను ప్రింట్ తీసి, మీరు ప్రూఫ్ కింద సబ్మిట్ చేసిన వాటిని ఎన్‌ఎస్‌డిఎల్ ఆఫీస్‌((Building-1, 409-410, 4th Floor, Barakhamba Road, New Delhi, PIN: 110001))కు పంపించాలి.

(చదవండి: దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top