అన్నీ ధరలు పెరుగుతున్నాయ్, కార్ల ధరల్ని పెంచుతున్నాం

ముంబై: మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో మరోసారి కార్ల ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే నెల(జూలై) నుంచి తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీలు, స్టీల్‌తో సహా ముడిసరుకుల వ్యయాలు పెరగడంతో తమ ఉత్పత్తులపై ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు మోడళ్ల ఆధారంగా ఉంటుందని, ఏ మోడల్‌పై ఎంత ధర పెంచుతామనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి కార్ల ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మీకలనా, అయితే ఈ టెక‍్నాలజీ నేర్చుకోండి