పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!

Govt extends last date to Submit Annual Life Certificate for Pension - Sakshi

కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ నేడు ప్రకటన చేసింది కేంద్రం. "వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కేసుల సంఖ్య పేరుగతున్న దృష్ట్యా వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న 31.12.2021 కాలవ్యవధిని ఫిబ్రవరి 28, 2022 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు" పెన్షన్ల విభాగం పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండంలో తెలిపింది.

అప్పటి వరకూ వారి పెన్షన్‌ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండ‌బోద‌ని పేర్కొంది. వృద్ధుల‌కు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కార‌ణంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు నవంబర్ నెలలో కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది.

(చదవండి: ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ తెలిస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top