ఆ ‍స్కీం కింద ఏవియేషన్‌కి రూ. 1,500 కోట్ల రుణ పరిమితి

Govt Enhances Eclgs For Airlines To Avail Up To Rs 1500 Crore Loan - Sakshi

కోవిడ్‌ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్‌జీఎస్‌కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top