Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!

Government Computer Emergency Response Team flagged the vulnerabilities in Google Chrome - Sakshi

గూగుల్‌ క్రోమ్‌ వాడే యూజర్లకు కేంద్ర  ప్రభుత్వం హెచ్చరించింది.  మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌లో అధిక తీవ్రతతో కూడిన సమస్య ఉన్నట్లు గుర్తించింది. CERT-In ప్రకారం గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌లో అనేక దుర్బలత్వాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో యూజర్లపై సైబర్ దాడులు సులువుగా జరిగే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది.గూగుల్‌ క్రోమ్‌ V8 టైప్ కన్ఫ్యూజన్ కారణంగా అనేక సమస్యలను ఉన్నట్లు తేలింది. దీంతో హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకొని కంప్యూటర్‌లో మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేసేందుకు సులువుగా ఉంటుందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. 

గూగుల్‌..నివారణ చర్యలు..!
గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌బ్రౌజర్‌లో సమస్యలు ఉన్నట్లు గూగుల్‌ కూడా గుర్తించింది. అందుకోసం నివారణ చర్యలను కూడా చేపట్టింది. గూగుల్‌ క్రోమ్‌ అప్‌డేట్‌డ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్లు వీలైనంత త్వరగా క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. సుమారు 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్‌ తెలిపింది.గూగుల్‌ ఇటీవల ప్రకటించినట్లుగా విండోస్‌, మ్యాక్‌, లైనెక్స్‌ కోసం విస్తృతంగా ఉపయోగించే క్రోమ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ను 96.0.4664.93 రిలీజ్‌ చేసింది.

మీ క్రోమ్‌ బ్రౌజర్‌ని ఇలా అప్‌డేట్ చేయండి

• Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్‌ చేయండి.

• కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి

•హెల్ఫ్‌పై క్లిక్‌ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్‌డేట్‌ అప్షన్‌పై క్లిక్‌ చేయండి.

ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్‌ క్రోమ్‌పై క్లిక్‌ చేసి అప్‌డేట్‌ అప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. 

చదవండి: జియో కమాల్‌: ప్రపంచంలోనే చీపెస్ట్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌.. కస్టమర్లకు పండగే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top