Google Pay: బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు!

Google Pay Fixed Deposit Interest Rate - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  గూగుల్‌ పే యూజర్లు బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్‌ చేస్తున్నట్టు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్‌డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ గ్యారంటీ ఉంటుందని వివరించింది. 

వినియోగదార్లు  గూగుల్‌ పే యాప్‌లో బిజినెస్‌ అండ్‌ బిల్స్‌ విభాగంలో ఈక్విటాస్‌ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. డిపాజిట్‌ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్‌డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్‌ వెల్లడిం చింది.  

చదవండి: పండుగ సెంటిమెంట్‌, కార్లను తెగకొనేస్తున్నారు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top