గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!

Google Map New Update Eco Friendly Route Feature - Sakshi

సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మనకి మొదట గుర్తొచ్చేది గూగుల్‌ మ్యాప్స్‌. చేతిలో మొబైల్‌ అందులో గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ ఉంటే చాలు ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది. ఈ యాప్‌ గమ్యాన్ని చూపించే క్రమంలో ఒక్కో సారి మనం వెళ్లాల్సిన ప్రదేశం పక్కనే ఉన్న చుట్టూ తిరిగేలా చేస్తుంది. దీని వల్ల వాహనదారులు సమయం వృథా కావడంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఎక్కవగానే అవుతుంది.

ఇలాంటి ఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ సమస్యను అధిగమించేలా సరికొత్త ఫీచర్‌ను గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ రూట్‌ పేరుతో వినియోగదారుడు వెళ్లాల్సిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం అయ్యేలా చూస్తుంది. దీని వల్ల మన సమయం, పెట్రోల్‌ తద్వారా మన ఖర్చు కూడా ఆదా అవుతుంది. 

"ఎకో-ఫ్రెండ్లీ రూట్" ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్‌ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ చెప్పింది. ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ.. మరో రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుందా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top