బంగారానికి ఏమైంది? ఒక్కరోజే ఇంత జంప్ ఎందుకు? | Gold Price Surges Rs 4300 Hyderabad 24K Gold Nears 160000 | Sakshi
Sakshi News home page

బంగారానికి ఏమైంది? ఒక్కరోజే ఇంత జంప్ ఎందుకు?

Aug 20 2026 9:43 PM | Updated on Aug 20 2026 9:50 PM

Gold Price Surges Rs 4300 Hyderabad 24K Gold Nears 160000

బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్లో గురువారం (ఆగస్టు 20) 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,950 పెరిగి రూ.1,46,000 పలికింది.అంటే ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారం దాదాపు 2.8 శాతం పెరిగింది.

ఇంత భారీ పెరుగుదలకు కారణమేంటి?

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో ఇటీవల చోటుచేసుకున్న భారీ కదలికలు దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్‌ విలువ, ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌లో మార్పులు, ఫెడ్‌ వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌ను పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధర ఒక్క సెషన్‌లో 4 శాతానికి పైగా ఎగిసింది.

దీనికి తోడు అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్‌ పరిణామాలు వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అనిశ్చితి పెరిగినప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారానికి డిమాండ్‌ పెరగడం సహజం.

ఇదీ చదవండి: స్టాక్‌మార్కెట్‌లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్‌ ట్రేడింగ్‌’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement