పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Published Tue, Feb 6 2024 2:01 PM

Gold And Silver Price Today 6 February 2024 - Sakshi

భారతదేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా పసిడి పరుగులకు బ్రేక్ పడింది. ఈ రోజు గోల్డ్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57750 (22 క్యారెట్స్), రూ.63000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు తెలుస్తోంది.

చెన్నైలో నిన్న రూ.200 నుంచి రూ.220 వరకు తగ్గినా బంగారం ధరలు ఈ రోజు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. దీంతో చెన్నైలో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58300 (22 క్యారెట్స్), రూ. 63600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.

ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 200 తగ్గి 5900 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 220 తగ్గి 63150 రూపాయలకు చేరింది.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా ఈ రోజు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు రూ. 700 తగ్గింది.

Advertisement
 
Advertisement
 
Advertisement