పేటీఎం కొత్త వ్యూహం | Paytm UPI Payments come up with new strategy | Sakshi
Sakshi News home page

పేటీఎం కొత్త వ్యూహం

May 10 2024 1:04 PM | Updated on May 10 2024 4:03 PM

Paytm UPI Payments come up with new strategy

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్‌ బ్యాంక్‌ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్‌ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్‌లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది.

పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్‌స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్‌ బ్యాంక్‌ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్‌ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. నేరుగా క్రెడిట్‌కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్‌గేట్ల వద్ద ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్‌ సర్వీస్‌ను అందించింది.

ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్‌పీసీఐ ద్వారా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (టీపీఏపీ) లైసెన్స్‌ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తోంది.

బ్యాంకింగ్‌ సేవలిందిస్తున్న యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌లు పేటీఎంకు పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్‌ బ్యాంక్‌ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్‌ కలిగిన మర్చంట్‌ పేమెంట్స్‌ యస్‌ బ్యాంక్‌కు రీడైరెక్ట్‌ అయ్యాయి.

ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!

మార్కెట్‌లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్‌బ్యాంక్‌ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్‌ పే, గూగుల్‌ పే, ఫోన్‌పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement