FuelPriceHike: నెలలో పన్నెండోసారి!

Fuel Price Hike Twelfth Time In May 2021 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. శనివారం ఊరట ఇచ్చినట్లే ఇచ్చి.. ఆదివారం స్వల్ఫంగా పెంచాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై పదిహేడు పైసలు, డీజిల్‌పై  29పైసలు పెరిగాయి. ఈ నెలలో ఫ్యూయల్‌ ధరలు పెరగడం ఇది పన్నెండోసారి. తాజా ధరలతో ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ వందకు దగ్గరైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.49పైసలకు, డీజిల్‌ ధర రూ.91.30 పైసలకి చేరుకుంది. 

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91
చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.88.87
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.96.88, డీజిల్‌ రూ.91.65
జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.91.65
బెంగళూరులో పెట్రోల్‌ రూ.96.31, డీజిల్‌ రూ.89.12
తిరువనంతపురం పెట్రోల్‌ రూ.95.19, డీజిల్‌ రూ.90.36

వ్యాట్‌ తదితర కారణాల వల్ల రాష్ట్రాల మధ్య ఫ్యూయల్‌ ధరల్లో తేడాలు ఉండే విషయం ఉంటుందన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని నగరాల్లో ఇప్పటికే పెట్రోల్‌ లీటర్‌ వంద దాటింది. రాజస్థాన్‌ చమురు ఆయిల్స్‌పై అత్యధికంగా వ్యాట్‌ విధిస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top