Flipkart: కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్‌కార్ట్

Flipkart TBBD 2023 Sales Growth All Time High This Year - Sakshi

Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 ఫ్లిప్‌కార్ట్‌ యాన్యువల్ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్‌ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది.

ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్‌లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది.

మునుపటి కంటే ఎక్కువ
అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్‌కార్ట్‌ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం.

అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్‌స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: యూజ్‌లెస్‌ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్‌ అయ్యాను..

బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టంట్ సేవింగ్స్, అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్‌తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి.

60 శాతం మెంబర్‌షిప్‌
ఫ్లిప్‌కార్ట్‌ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్‌షిప్‌లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్‌లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్‌లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్‌ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి.

ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం!

ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top