టెస్లా బ్యాటరీతో.. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఇప్పుడు ఇండియాలో

First Time LifePO4 Batteries Are Used In Avera New Electric Scooter Which Is Used By Tesla - Sakshi

అవేరా రెట్రోసా హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 

సాక్షి, అమరావతి / బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన రంగంలో ఉన్న విజయవాడకు చెందిన అవేరా న్యూ, రెనివేబుల్‌ ఎనర్జీ మోటో కార్ప్‌ టెక్‌.. రెట్రోసా స్కూటర్‌ కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్థాయి వేగం కలిగిన ఈ–స్కూటర్‌ భారత్‌లో ఇదేనని కంపెనీ తెలిపింది.

టెస్లా బ్యాటరీతో
టెస్లా కంపెనీ తయారు చేసే కార్లలో వినియోగిస్తున్న లైఫ్‌పీవో4 రకానికి చెందిన బ్యాటరీలను ఈ ఎలక్ట్రిక్‌ స​‍్కూటర్‌లో వినియోగించారు. ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు ఈ తరహా బ్యాటరినీ పొందుపర్చడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఆవేరా ఫౌండర్‌ రమణ తెలిపారు.

ఆటోమేటిక్‌ ఆన్‌/ఆఫ్‌
స్కూటర్‌పైన కూర్చోగానే హ్యాండిల్‌కు ఉన్న కెమెరా సెన్సార్స్‌ ఆధారంగా వాహనం స్టార్ట్‌ అవుతుంది. వాహనం దిగగానే ఆఫ్‌ అవుతుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే ఎకానమీ డ్రైవ్‌లో 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ధర సబ్సిడీలు పోను రూ.1.25 లక్షలు. బ్యాటరీ చార్జింగ్‌ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వాహనాన్ని సోమవారం విజయవాడలో పరిశీలించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top