ఆ పథకాలపై ఫోకస్‌.. పీఎస్‌యూ బ్యాంకులతో ఆర్థిక శాఖ సమావేశం

finance ministry to meet public sector banks to review financial inclusion schemes - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్‌ 13న సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ వివేక్‌ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన ముద్రా యోజన, జన సురక్షా తదితర పథకాలపై సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పాయి.

(జీతం నుంచి టీడీఎస్‌ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు)

స్టాండప్‌ ఇండియా, పీఎం స్వనిధి పథకాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాల పరిధిలో సంతృప్త స్థాయికి చేరుకునే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం.

ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్‌ స్టోర్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌.. భారత్‌ రానున్న టిమ్‌కుక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top