
బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) కొత్త చైర్మన్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి 'అజయ్ సేత్' సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సేత్ కేంద్ర ఆర్థిక శాఖలో నాలుగేళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఈ ఏడాది జూన్‌లోనే పదవీ విరమణ చేశారు.
స్వల్ప విరామంతో ఆయన్ని కీలకమైన ఐఆర్‌డీఏఐ చైర్మన్ బాధ్యతల్లో కేంద్రం కూర్చోబెట్టడం గమనార్హం. బీమా రంగంలో ఆరోగ్యకరమైన పోటీకి, అందరికీ బీమా సేవల విస్తృతికి, ఉత్తమ ప్రమాణాల అమలుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఐఆర్‌డీఏఐ కృషి చేస్తుంటుంది.