భారత్‌లో ట్విటర్‌ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్‌ మస్క్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Elon Musk Says Twitter Very Slow In India And Many Other Countries - Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చర్యలు కాస్త వింతగా ఉండడంతో పాటు నెట్టింట వైరల్‌గా కూడా మారుతుంటాయి. ఇక తాజాగా ఆయన హస్తగతం చేసుకున్న ప్రముఖ ట్విటర్‌ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసిన అందరినీ ఆశ్చర్యపరిచాడు.

చాలా స్లోగా ఉంది
అనుహ్య పరిణామాల మధ్య ట్విటర్‌ సీఈవోగా ఎలాన్‌ మస్క్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయిలో  ట్విటర్‌ సిబ్బంది తొలగింపు, బోర్డు మేనేజ్‌మెంట్‌ మార్చడం వంటివి చేయగా తాజాగా ట్విటర్‌ భారత్‌తో పాటు పలు దేశాల్లో చాలా నెమ్మదిగా ఉందంటూ ఏకంగా షాక్‌ ఇచ్చాడు. ఒక సీఈవో తన కంపెనీ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

"భారతదేశం, ఇండోనేషియా & అనేక ఇతర దేశాలలో ట్విట్టర్ చాలా నెమ్మదిగా ఉంది. ఇది వాస్తవం. హోమ్‌లైన్ ట్వీట్‌లను రిఫ్రెష్ చేయడానికి 10 నుండి 15 సెకన్ల సమయం సాధారణం.  కానీ ముఖ్యంగా (Android phone) యాండ్రాయిడ్‌ ఫోన్‌లలో కొన్నిసార్లు, ఇది అస్సలు పని చేయడం లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే బ్యాండ్‌విడ్త్/లేటెన్సీ/యాప్ కారణంగా ఎంత ఆలస్యం అవుతుందని’ ఈ ట్విట్టర్ కొత్త యజమాని ట్వీట్ చేశారు. వీటితో పాటు.. యుఎస్‌లో అదే యాప్ రిఫ్రెష్ కావడానికి ~2 సెకన్లు పడుతుంది (చాలా ఎక్కువ సమయం), కానీ బ్యాచింగ్/వెర్బోస్ కామ్‌ల కారణంగా భారతదేశంలో ~20 సెకన్లు పడుతుందని తెలిపారు.

మరోక ట్విట్‌లో.. ‘చాలా దేశాల్లో ట్విట్టర్ స్లో అయినందుకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. హోమ్‌ టైమ్‌లైన్ (sic) రెండర్ కోసం వెయ్యికంటే ఎక్కువ పూర్లీ బ్యాచ్డ్ RPCలను (Remote Procedure Call) యాప్ చేస్తోందని’ పోస్ట్ చేశారు.  కాగా RPC అంటే డిస్ట్రిబ్యూటెడ్, క్లైంట్ సర్వర్ బోస్డ్ అప్లికేషన్స్ కన్‌స్ట్రక్షన్‌ కోసం వాడే పవర్‌ఫుల్ టెక్నిక్.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top