విమాన ప్రయాణికులు @ 12.73 కోట్లు

Domestic air passengers growth 14percent to 12.73 crore in December - Sakshi

డిసెంబర్‌లో 14 శాతం వృద్ధి

 ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య డిసెంబర్‌లో 12.73 కోట్లుగా నమోదైంది. అంతక్రితం డిసెంబర్‌తో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధి చెందింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన నెలవారీ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021 డిసెంబర్‌లో 11.20 కోట్ల మందిని దేశీ ఎయిర్‌లైన్స్‌ గమ్యస్థానాలకు చేర్చాయి. తాజాగా గత నెలలో ఇండిగో ద్వారా 69.97 లక్షల మంది ప్రయాణించారు.

ఎయిరిండియా 11.71 లక్షల ప్యాసింజర్లను, విస్తారా 11.70 లక్షలు, ఎయిర్‌ఏషియా 9.71 లక్షలు, స్పైస్‌జెట్‌ 9.64 లక్షలు, గో ఫస్ట్‌ 9.51 లక్షలు, ఆకాశ ఎయిర్‌ 2.92 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. మార్కెట్‌ వాటా పరంగా చూస్తే ఇండిగోకు 55.7 శాతం, ఎయిరిండియాకు 9.1 శాతం, విస్తారాకు 9.2 శాతం, ఎయిర్‌ఏషియాకు 7.6 శాతం, ఆకాశ ఎయిర్‌కు 2.3 శాతం ఉంది. నాలుగు కీలకమైన మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సమయ పాలనలో ఇండిగో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top