
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏజీఆర్‌లో (సవరించిన స్థూల ఆదాయం) 8 శాతంగా ఉన్న డీటీహెచ్ లైసెన్సింగ్ ఫీజుని 3 శాతానికి తగ్గించాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిష్ టీవీ సీఈవో మనోజ్ దోభాల్ కోరారు.
సవాళ్లతో సతమతమవుతున్న డీటీహెచ్ పరిశ్రమ దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేందుకు, వృద్ధి చెందేందుకు ఇవి దోహదపడతాయని, వీటిపై సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖకు విజ్ఞప్తి చేశారు.
ట్రాయ్ సిఫార్సులను అమలు చేయడం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభిస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన సరీ్వసులు లభిస్తాయని మనోజ్ చెప్పారు. సరీ్వస్ ప్రొవైడర్లు, పే టీవీ వ్యవస్థ మనుగడకు .. ఇప్పుడున్న లైసెన్సింగ్ విధానాలు ప్రతిబంధకాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.