డిష్‌ టీవీకి షాక్‌! వాటాదారులతో అంత ఈజీ కాదు! | Sakshi
Sakshi News home page

డిష్‌ టీవీకి షాక్‌! వాటాదారులతో అంత ఈజీ కాదు!

Published Wed, Mar 9 2022 2:19 PM

Dish Tv Discloses 33rd Agm Voting Results - Sakshi

గతేడాది(2021) డిసెంబర్‌ 30న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో ప్రతిపాదనలన్నీ వీగిపోయినట్లు డీటీహెచ్‌ సేవల కంపెనీ డిష్‌ టీవీ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు, డైరెక్టర్‌గా తిరిగి ఏఎం కురియన్‌ ఎంపిక తదితర మూడు ప్రతిపాదనలనూ వాటాదారులు తిరస్కరించినట్లు తాజాగా స్టాక్‌ ఎక్సేంజీలకు తెలియజేసింది.

అతిపెద్దవాటాదారు అయిన యస్‌ బ్యాంక్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఇప్పటివరకూ వివరాలను బయటపెట్టలేదని కంపెనీ ప్రస్తావించింది. అయితే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఈ అంశాలను వెల్లడించినట్లు డిష్‌ టీవీ పేర్కొంది.

ఇటీవల జరిగిన 33వ ఏజీఎంలో ప్రతిపాదించిన 2021–22 ఏడాదికి కాస్ట్‌ ఆడిటర్స్‌ రెమ్యునరేషన్, స్టాండెలోన్, కన్సాలిడేటెడ్‌ ఫలితాలు, కురియన్‌ పునఃనియామకం అంశాలకు వ్యతిరేకంగా అధిక శాతం వోటింగ్‌ నమోదైనట్లు వివరించింది.
 

Advertisement
Advertisement