Delhi Engineer Find Job After Applying To More Than 150 Companies In The Last 8 Months - Sakshi
Sakshi News home page

Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా  కంపెనీలకు అప్లై చేశాడు..  మొత్తానికి...

Mar 27 2023 10:23 AM | Updated on Mar 27 2023 10:53 AM

Delhi techie got job after hundreds of rejections applied to more than 150 companies in 8 months - Sakshi

టెక్‌ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి నానా తంటాలు  పడుతున్నారు. కొంత మంది నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఈ  నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొత్త ఉద్యోగం చేసిన దండయాత్ర గురించి తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం..

ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?

ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎనిమిది నెలల సుదీర్ఘ శోధన తర్వాత ఇటీవల ఒక టెక్ సంస్థలో ఉద్యోగం పొందాడు. ఆ ఎనిమిది నెలల సమయంలో అతను 150 కంటే ఎక్కువ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఉద్యోగ వేట కథను లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేశాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాన్ని పొందడం సవాలుగా మారిందన్నాడు. వందలాది కంపెనీలు తనను రిజెక్ట్‌ చేశాయన్నాడు.

ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! 

150 కంపెనీలకు అప్లై చేస్తే 10 కంపెనీల నుంచి మాత్రమే రెస్పాన్స్‌ వచ్చిందని, వాటిలో కేవలం ఆరింటికి మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయని వివరించాడు. అమెజాన్ స్కాట్‌లాండ్‌తో ఇంటర్వ్యూలో అన్ని రౌండ్‌లు పూర్తయ్యాయని, కానీ చివరి దశలో నియామకం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్‌  సంస్థలో అయితే డీఎస్‌ఏ రౌండ్‌లలో రిజెక్ట్‌ అయిందన్నారు. 

ఈ పోస్టు రాయడం వెనుక ఉద్దేశం.. పరిస్థితులు గతంలో మాదిరిగా లేవని, ఉద్యోగం కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందేనని తెలియజేయడమేనని వివరించాడు.  ఉద్యోగ వేటలో ఉన్నవారు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించాడు.

ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement