డెబిట్‌ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్‌ | Debit Card Charges Will Be Hike From April 1st By State Bank Of India | Sakshi
Sakshi News home page

డెబిట్‌ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్‌

Mar 30 2024 11:24 AM | Updated on Mar 30 2024 12:50 PM

Debit Card Charges Will Be Hike From April 1st By State Bank Of India - Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) డెబిట్‌ కార్డులపై నిర్వహణ ఛార్జీలను సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెబిట్‌ కార్డుల నిర్వహణ ఖర్చును పెంచనున్నట్లు తెలిపింది. ఈమేరకు నిబంధనలను సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

క్లాసిక్‌ డెబిట్‌ కార్డులు, సిల్వర్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై వార్షిక నిర్వహణ రుసుమును రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్‌, కాంబో డెబిట్‌ కార్డు, మై కార్డ్‌ల నిర్వహణ ఛార్జీలను రూ.175 నుంచి రూ.250కి చేర్చింది. ప్లాటినం డెబిట్‌ కార్డుల విభాగంలోని ఎస్‌బీఐ ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది.

ఇదీ  చదవండి: శని, ఆదివారాల్లో ఎల్‌ఐసీ ఆఫీసులు ఓపెన్‌.. కారణం..

ప్లాటినం బిజినెస్‌ కార్డు ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగాయి. ఈ ఛార్జీలపై జీఎస్‌టీ అదనం. ఎస్‌బీఐ కార్డ్‌ అందిస్తున్న ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపైనా కొన్ని కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లించినప్పుడు ఇకపై రివార్డు పాయింట్లు లభించవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement