ఫ్లాట్‌గా కదులుతున్న సూచీలు | Daily Stock Market Update In Telugu March 22 | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా కదులుతున్న సూచీలు

Mar 22 2022 9:40 AM | Updated on Mar 22 2022 9:49 AM

Daily Stock Market Update In Telugu March 22 - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. మార్కెట్‌ను ప్రతికూలంగా లేదా సానుకూలంగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉ‍న్నారు. మరోవైపు అంతర్జాతీయ సూచీలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. అదే ట్రెండ్‌ ఇక్కడా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9:35 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 17 పాయింట్ల లాభంతో 57,310 దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 17,105 దగ్గర కొనసాగుతోంది.

టాటాస్టీల్‌, విప్రో, టీసీఎస్‌, మారుతి సుజూకి, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌యూఎల్‌, నెస్టల్‌ ఇండియా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పేయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement